సౌత్ ఇండియన్ సూపర్*స్టార్ రజినీకాంత్ అల్లుడు, ప్రముఖ తమిళ హీరో ధనుష్ తీవ్రమయిన జ్వరం కారణంగా చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ఎప్పుడూ ఎంతో ఉల్లాసంగా ఉండే ఈ యువ హీరో గత కొంత కాలంగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడని తెలిసింది. అందుకే రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య పెళ్లిలో కూడా ధనుష్ చురుకుగా లేడు. సౌందర్య రిసెప్షన్ కి కూడా ధనుష్ అసలు హాజరు కాలేదు. మరో రెండు రోజుల వరకు ఆసుపత్రిలోనే ధనుష్ ఉండే అవకాశం ఉంది అని ఆసుపత్రి వర్గాలంటున్నాయి.
ప్రస్తుతం ధనుష్ తన అన్న సెల్వ రాఘవన్ రూపొందిస్తోన్న “మరువన్” చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర హీరోయిన్ హన్సికా మోత్వానీ కూడా జ్వరంతో మంచమెక్కి విశ్రాంతి తీసుకుంటోంది.
Bookmarks