కొండారెడ్డి ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది కర్నూలు కొండారెడ్డి (బురుజు ) గురించి మాట్లాడటం లేదు. ఈ కొండారెడ్డి వేరు. ఈయన కడప కొండారెడ్డి. మాంత్రికుడి ప్రాణాలు చిలుకలో ఉన్నట్లు ఇప్పుడు జగన్ ఆగడాలు కొండారెడ్డి నోట్లో ఉన్నాయి. ఆయన నోరు విప్పితే జగన్ అవుట్.
ఇంతకీ విషయం ఏంటంటే గాలికి కేటాయించిన ఓబుళాపురం గనులకు గాలి జనార్దన్ రెడ్డితో పాటు చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు చేసుకున్న వారిలో కడపలోని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కొడుకు కొండారెడ్డి కూడా ఉన్నారు. లీజు కేటాయింపులు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ (ముందు వచ్చిన వారికి ముందు) ప్రాతిపదికన కేటాయించాలి. అన్నిఅర్హతలు ఉన్న కొండారెడ్డి గాలి కంటే వరుసలో ముందు ఉండటంతో ఆయనకు మంజూరైంది. దానికి కేవలం ముఖ్యమంత్రి, గనుల శాఖ అప్రూవ్ చేయడమే మిగిలింది. అయితే, ఇంతలో సీను మారింది. వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎన్నికల్లో అన్నిరకాలుగా సహాయపడిన గాలికి గనులు దక్కేలా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో జగన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ క్రమంలో కొండారెడ్డిని అడిగారు, బుజ్జిగించారు, పదవులు-డబ్బు ఆశ చూపారు. కానీ ఆయన వినలేదు. దీంతో బెదిరించారు. ప్రాణం మీదికి తెచ్చుకోవడం ఇష్టం లేక కొండారెడ్డి చివరకు రాజీపడాల్సి వచ్చింది. కోర్టులో వేసిన కేసు కూడా అతను విత్ డ్రా చేసుకున్నాడు. గనులు గాలి సొంతమయ్యాయి. గాలి జనార్దన్ రెడ్డి, కొండారెడ్డి తెలియదు అని జగన్ సీబీఐకి చెప్పిన వెంటనే వారు ఏకంగా కొండారెడ్డిని చూపించారు. ఇప్పుడు కూడా తెలియదు అనడంతో మొత్తం సీను జగనుకు అర్థమైంది. అదీ విషయం.
సీబీఐతో కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాను అని కొండారెడ్డి అన్నారు. అంతవరకు ఆయన్ను సీబీఐ రక్షించగలిగితే జగన్ జైలుకు వెళ్లడం గ్యారంటీ అని సమాచారం. ఇది ఎన్నిరోజులు పడుతుందన్న దానికి గ్యారంటీ లేదు.
Bookmarks