Page 25 of 25 FirstFirst ... 15232425
Results 481 to 491 of 491

Thread: ANR-sangraha vartalu-Titbits

 1. #481
  Join Date
  Jun 2015
  Posts
  7,979

  Default  Sangrahavaartha 361.

 2. #482
  Join Date
  Jun 2015
  Posts
  7,979

  Default  Sangrahavaartha 362.

 3. #483
  Join Date
  Jun 2015
  Posts
  7,979

  Default  Sangrahavaartha 363.

 4. #484
  Join Date
  Jun 2015
  Posts
  7,979

  Default  Sangraha vaartha 364.

 5. #485
  Join Date
  Jun 2015
  Posts
  7,979

  Default

  256 చిత్రాలు
  27 తమిళ్
  1 హిందీ
  30 జూబ్లీ చిత్రాలు
  145 శతదినోత్సవ చిత్రాలు
  1హిందీ జూబ్లీ
  3 భాషల్లో జూబ్లీ కల ఏకైక నటులు
  74 మంది దర్శకులు
  62 మంది హీరోహిన్స్
  4 తమిళ జూబ్లీ చిత్రాలు
  1200+ అవార్డ్స్
  పద్మశ్రీ
  పద్మ విభూషన్
  దాదాసాహెబ్ ఫాల్కే
  #Natasamrat
  #ANR
  #ANRLivesOn

  Sangraha vaartha...365.

 6. #486
  Join Date
  Jun 2015
  Posts
  7,979

  Default

  ఉత్సవగీతాలు - 392
  " చరణదాసి " నలుగురు ఉద్దండపిండాలు కలిసి నటించిన చిత్రం. అందులో నాయికానాయకులుగా నటించిన ఆ నలుగురి వర్ధంతులు నెల్లాళ్ళ పరిధిలో రావటం కాకతాళీయమే! డిసెంబర్ 26 మహానటి సావిత్రి వర్ధంతి అయితే, జనవరి 14 అంజలీదేవి, 18 జనవరి రామారావు, 22 జనవరి నాగేశ్వరరావులది. ఈ రోజు దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్ అవార్డుల గ్రహీత అక్కినేని వర్ధంతి. అంజలీదేవి-అక్కినేని సుమారు 29 చిత్రాల వరకూ కలిసి నటించారు. అందులో కధానాయికగానే కాదు కన్నతల్లి, వదినగారు పాత్రలు కూడా ఉన్నాయి. అంజలీదేవి దంపతులకు అక్కినేని కుటుంబంతో స్నేహబాంధవ్యాలు ఎక్కువగా ఉండేవి. ఆ బాంధవ్యం తోనే అంజలీదేవి దంపతులు అక్కినేనితో ఎక్కువ చిత్రాలు తీశారు కూడా! చిత్రసీమకు రాకముందు అప్పుడప్పుడు నాటకరంగం మీద వీరు కలుసుకొనేవారట! ఆ స్నేహబంధంతోనే ఆదినారాయణరావు గారు అక్కినేని కలిసి అశ్వనీ పిక్చర్స్ స్థాపించి ఓకటి, రెళ్డు సినిమాలు తీశారు కూడా! అంతకుముందు చిత్రగీతాలకు కధానాయికలు మాత్రమే నర్తించేవారు. అందుకని కధానాయికలుగా వచ్చేవారికి తప్పనిసరిగా నాట్యం వచ్చి ఉండాలని నిబంధన ఉండేది. చిత్రగీతాలకు నాయకుడిలో కదలికలు ఉండాలని తీర్మానించి తొలిసారిగా తెలుగు చిత్రాలలో స్టెప్పులు మాయలమారి చిత్రంనుంచి ప్రారంభించారు. అవి తొలినాళ్ళలో నాయకుడు లయాత్మకంగా నడవటమో, పరిగెత్తటంతోనో ప్రారంభమై ప్రస్తుతం యోగాసనాలు, సూర్యనమస్కారాల రీతిలో చేతులు, కాళ్ళు కదపటం వరకూ వెళ్ళిపోయింది. దాన్ని సరిగా అర్ధం చేసుకోలేనివాళ్ళు కుప్పిగంతులు అని అపార్ధం చేసుకొంటున్నారు. ఇక తెలుగుగీతాలలో వేదాంతానికి పెట్టింది పేరు ఆచార్య ఆత్రేయ గీతాలు. అవి చిత్రగీతాలుగా కాక పరిపూర్ణమైన స్టేటుమెంట్లలా ఉంటాయి. అలాంటి ఒక స్టేట్మెంట్ గీతమే భార్యాబిడ్డలు చిత్రంలో ఘంటసాల పాడిన యీ గీతం. భార్యాబిడ్డలు చిత్రానికి మాతృక 1950 లో వచ్చిన బ్రతుకుతెరువు చిత్రమే! కాకుంటే దానిలో సావిత్రి పాత్ర రోగం ఉన్న పాత్ర కాదు. జమీందారుగారి అమ్మాయి. పెళ్ళి కాలేదనుకొని నాయకుడిపై ఆశలు పెంచుకొంటుంది. నాయకుడు బ్రతుకుతెరువు కోసం పెళ్ళి కాలేదని అబద్ధమాడుతాడు. ఇక్కడ యించుమించు కధ అదే కానీ భార్యాబిడ్డలు చిత్రంలో నాయిక జయలలిత ఒక రోగం కల అమ్మాయి. అంతే తేడా! ఇక పాటలోకి వెడదాం. " ఒలికే ప్రతి కన్నీటిచుక్క వెచ్చగా ఉంటుంది" అంటారు ఆత్రేయ. ఆలశ్యమెందుకు. ఆత్రేయమార్కు వేదాంతాన్ని ఆస్వాదించండి. భార్యాబిడ్డలు చిత్రంలో ఘంటసాల పాడిన యీ పాటకు సంగీతం అందించినది . అక్కినేని వారి వర్ధంతి సందర్భంగా యీ గీతాన్ని చూడండి.
  Sangraha vaartha...366.

 7. #487
  Join Date
  Jun 2015
  Posts
  7,979

  Default

  నట సామ్రాట్*'.. 'దాదాసాహెబ్* ఫాల్కే అవార్డు గ్రహీత' అక్కినేని నాగేశ్వరరావు గారి వర్ధంతి నేడు.
  "అక్కినేని నాగేశ్వరరావు మన మనస్సులో ఎప్పుడు జీవించే ఉంటారు"
  సిని వినీలాకాశంలో పౌర్ణమి చంద్రుడు ముళ్లబాటలో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని ఆయన ఈ స్తితికి చేరుకున్నారు పేదరికంలో పుట్టి నాటకాలలో ఆడవేషం తో తన నట ప్రస్తానం మొదలు పెట్టారు ధర్మపత్ని సినిమాతో నటుడిగా కెరీర్*ని ఆరంభించి దాదాపు 75 ఏళ్ల సుదీర్ఘమైన తన నటనా జీవితంలో 225కి పైగా సినిమాల్లో నటించిన బహుదూర బాటసారి మన అక్కినేని. అక్కినేని అంటే ఓ నట శిఖరం. తెరమీద అలుపెరుగక నటిస్తూ ముందుకెళ్తున్న ఓ సంపూర్ణ నటతత్త్వం. అవార్డులంటే అక్కినేనిగా పేరుపడినా... అవి తనను వరించడానికి కేవలం ఒకే ఒక్క సూత్రం పాటిస్తూ ముందుకెళ్ళాడీ సూత్రధారి. అదే పాత్ర ఏదైనా.. ఆ పాత్రకు తగినట్టుగా అందులో ఇమిడిపోయి- దానికి ఇదివరకెన్నడూ లేని వన్నెలద్దడం ఆయన ప్రత్యేకత.
  నట సామ్రాట్ దాదాసాహెబ్ పాల్కేఅవార్డు గ్రహీత శ్రీ Dr.అక్కినేని నాగేశ్వర రావు తెలుగు సిని ప్రస్తానంలో తనకంటూ ఒక చరిత్రని లిఖించుకున్న గొప్ప నటుడు

  ఎన్నో రొమాంటిక్ రోల్స్ వేస్తూ వచ్చిన అక్కినేని... డూడూ బసవన్నను ఆడించే డీ గ్లామరైజ్డ్ పాత్రలనూ పోషించి సాటి లేని మేటిగా పేరు పొందాడాయన. మిస్సమ్మ, గుండమ్మ కథ, మాయాబజార్, వంటి సూపర్ డూపర్ హిట్లు అనేకం. ఆనాడు ఎఎన్నార్ తో సమానంగా పోటీ పడుతున్న మరో మహానటుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఒక పక్క శ్రీరామ, శ్రీకృష్ణ వంటి పాత్రలతో ప్రేక్షక జనుల పాలిట దేవదేవుడిగా చెలరేగి పోతుంటే... మదిలో ప్రేక్షకులనే దైవంగా భావించి... ఎందరో భక్త శిఖామణుల పాత్రలను పోషించి... పోటీని రసవత్తరం చేశాడు ఎఎన్నార్. అలా తెరమీది పోటీని తెలివిగా అధిగమించిన ఘనపాటి అక్కినేని.
  90 ఏళ్ల వయసులో కూడా తన తనయుడు నాగార్జున, మనువడు నాగచైతన్యతో కలసి నటించిన చిత్రం 'మనం'. ఈ సినిమానే ఆఖరి సినిమా అవడం, మూడు తరాల అద్భుతమైన సినిమా అవడంతో ఈ సినిమాకి ప్రేక్షకులు అఖండ విజయాన్ని అందించారు. 91 ఏళ్ల వయసులో అభిమానులను శోక సంద్రంలో ముంచుతూ జనవరి 22న తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయి శాశ్వత నిద్రలోకి ఉపక్రమించారు అక్కినేని నాగేశ్వరరావు
  అక్కినేని నాగేశ్వర రావు గారికి నివాళులు అర్పిస్తూ..
  - మ్యూజిక్ వరల్డ్ అడ్మిన్స్ Rajesh Sri అరుణ రమేష్ Surekha Das

  Sangraha vaartha 367.

 8. #488
  Join Date
  Jun 2015
  Posts
  7,979

  Default

  మరపురాని మనిషి :
  అక్కినేని వారు ఉన్న కాలంలో మేమూ వున్నాము. వారిని కలిసాము. అంతటి వారికి అభిమానిగా ఆయనతో పరిచయం కలగడం అనే భావన తలుచుకున్నప్పుడల్లా ఆనంద బాష్పాలు రాక ఆగవు. అక్కినేని గారి పదునైన చూపులు, ఎదుటి మనిషిని ఇట్టే స్కేనింగ్ చేయగల నేర్పు, అందమయిన నవ్వు, స్పష్టమయిన ఉచ్చారణ, ప్రవాహం లాంటి వాగ్ధాటి, నడకలో రాజసం, ప్రతికదలికలో హుందాతనం.....ఇలా వారిని వర్ణిస్తూ పోతుంటే భాష సరిపోదేమో. అటువంటి రూపాన్ని, వ్యక్తిత్వాన్నీ చూసిన నాకు వారంటే నాకు చెప్పలేనంత గౌరవం.అభిమానం. దూర దృష్టి, గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి.
  ఏది ఏమయినా అక్కినేని గారు వెళ్లి పోయారు. సంవత్సరాలు గడుస్తున్నాయి..కానీ రోజూ గుర్తుకొస్తున్నారు. ఈ రోజు ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పిస్తూ మళ్ళి పుట్టాలి మీరు అని భగవంతుడిని కోరుకుంటూ..........

  Sangraha vaartha 368.

 9. #489
  Join Date
  Jun 2015
  Posts
  7,979

  Default

  ఏరంగానికైన-ఏరంగంలోనైనా ఒక చరిత్ర వుంటుంది..అన్నివర్గాలవారికి, అన్నివయస్సులవారికి నాటినుండి నేటివరికు అద్భుతంగా అనిపించే రంగం సినిమారంగం..సాంకేతికంగా ఏంతపురోగమించినా ఆనాటికి ఈనాటికి ఏనాటికి సినిమా అన్నది ఓ అందమైన కల..
  అలా చలనచిత్రరంగానికి సంబంధించి చరిత్రకు నాందీ పలికినవారు కొందరయితే-చరిత్రను సృష్టించినవారు మరికొందరు-చరిత్రపుటల్లో శాశ్వతస్థానాన్ని కైవసం చేసుకున్నవారు ఇంకొందరు-చరిత్రే తమస్వంతం చేసుకున్న వారు మరెందరో...
  అలా ఆలోచిస్తే ఒక నాగయ్య గారు-పోతన,వేమన,త్యాగయ్య అనుకోగానే మొట్టమొదట స్ఫురించేది ఆయనే..అలాగే గుమ్మడిగారు,సి.ఎస్.ఆర్,కె.వి.ఎస్.శర్మ,జగ్గయ్య,రాజన ాల,ఆర్.నాగేశ్వర రావు,రేలంగి,రమణారెడ్డి,కన్నాంబ,సూర్యకాంతం,భానుమతి, సావిత్రి,అంజలీదేవి, షావుకారు జానకి,గిరిజా,ఎల్.విజయలక్ష్మి,జమున ఇలా మరపురాని నటీమణులు..
  ఇంకా వివిధ శాఖలకు సంబంధించిన లబ్ధప్రతిష్టులైన సాంకేతిక నిపుణులు ఎన్నోతరాలవారి హృదయాల్లో చెరుగని ముద్రవేసారు..
  నాటి తెలుగు సినిమాను స్వర్ణకాంతులతో ముంచెత్తిన మహానుభావుల్లో చాలమంది మనమధ్యలేరు..కాని వారి జ్ఞాపకాలు సజీవమై ఈనాటికి మనమనసుల్లోకి ఆ భావన చొరబడకుండా ఇంకా మనమధ్య వారిని నిలుపుతున్న ఈ సాంకేతిక ప్రగతిని మనం"సాహో"అనకతప్పదు..
  అలా తెలుగు సినిమా గురించి తలచినప్పుడు ఇద్దరు ఎన్నోతరాలవారికి పరిచయమైన ఇద్దరు గొప్పనటులు స్పురణకు వస్తారు...అఖిలాంధ్ర ప్రేక్షకుల నీరాజనాలందుకుంటూ వారి హృదయాల్లో తమవైవిధ్యమైన నటనతో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు..వారే అక్కినేని,ఎన్.టి.రామారావు..
  ఒకర్ని తలుచుకుంటే మరొకరు అప్రయత్నంగా మనకళ్ళముందు మెదులుతారు...
  తెలుగు సినిమాకు ఉచ్చాస్వనిశ్వాల్లాంటివారు..ఈరోజు నాగేశ్వరరావుగారికి సంబంధించిన రోజు..నిత్యవసంతుడు అక్కినేని..ఏభావాన్నైనా హద్దులు దాటకుండా ప్రకటించటం..తనలోని లోపాలను గుర్తెరిగి వాటిని సరిదిద్దుకొంటూ తన సినీప్రయాణాన్ని దిగ్విజయంగా తుదిశ్వాస వరకు కొనసాగించిన సమర్ధుడైన నటుడు అక్కినేని..భేషజాలు లేని వ్యక్తిత్వం,తెలుగుతనం ఉట్టిపడే పంచెకట్టు,ఆత్మీయత కనపరిచే అందమైన చిరునవ్వు,తాను నాల్గవ తరగతి వరకే చదువుకున్నానని ఎంతో వినయంగా చెప్పుకునే మహామనీషి..కాని ఆయనతో మాట్లాడుతుంటే ఓ మంచి గ్రంధాలయంలో కుర్చొన్న అనుభూతి కలుగుతుంది..విమర్శలను సహృదయతతో స్వీకరించటం..తన అభిమానులకు అందుబాటులో ఉండటం ఆయనలోని వ్యక్తిత్వానికి నిదర్శనం..
  ఆయనతో ఏహీరోయిన్ నటించినా హిట్టే..కొన్నిసార్లు ఆయన అంచనాలు తప్పిన సందర్భాలు లేకపోలేదు..సినిమాకు సంబంధించి జయాపజయాలు ప్రేక్షకాధీనాలు..
  ఏది ఏమైనా శృంగారానికి విషాదానికి అక్కినేని పెట్టింది పేరు.హద్దులు మీరని నటన,అతిగాలేని కదలికలు-చేష్టలు మహిళాలోకానికి అక్కినేనిని చేరువ చేసాయనటంలో సందేహంలేదు..
  యుగళగీతాల్లో అక్కినేని పాటలకు ఎప్పుడూ అగ్రతాంబూలమే..చుక్కలెన్నో చంద్రుడు ఒక్కడే..ఇంత స్వల్పవ్యవధిలో అందరితోను అక్కినేనిని చూపించటం కష్టం కనుక-ఆ"నిత్యవసంతుడి"తో కొందరు తారలు నటించిన ప్రణయగీతాలు..
  ఎప్పుడు తమనటనతో మనమధ్యే మనతోటే ఉన్న ఆమహానటుడికి ఆనందాంజలి..
  పరిచే అందమైన చిరునవ్వు,తాను నాల్గవ తరగతి వరకే చదువుకున్నానని ఎంతో వినయంగా చెప్పుకునే మహామనీషి..కాని ఆయనతో మాట్లాడుతుంటే ఓ మంచి గ్రంధాలయంలో కుర్చొన్న అనుభూతి కలుగుతుంది..విమర్శలను సహృదయతతో స్వీకరించటం..తన అభిమానులకు అందుబాటులో ఉండటం ఆయనలోని వ్యక్తిత్వానికి నిదర్శనం..
  ఆయనతో ఏహీరోయిన్ నటించినా హిట్టే..కొన్నిసార్లు ఆయన అంచనాలు తప్పిన సందర్భాలు లేకపోలేదు..సినిమాకు సంబంధించి జయాపజయాలు ప్రేక్షకాధీనాలు..
  ఏది ఏమైనా శృంగారానికి విషాదానికి అక్కినేని పెట్టింది పేరు.హద్దులు మీరని నటన,అతిగాలేని కదలికలు-చేష్టలు మహిళాలోకానికి అక్కినేనిని చేరువ చేసాయనటంలో సందేహంలేదు..
  యుగళగీతాల్లో అక్కినేని పాటలకు ఎప్పుడూ అగ్రతాంబూలమే..చుక్కలెన్నో చంద్రుడు ఒక్కడే..ఇంత స్వల్పవ్యవధిలో అందరితోను అక్కినేనిని చూపించటం కష్టం కనుక-ఆ"నిత్యవసంతుడి"తో కొందరు తారలు నటించిన ప్రణయగీతాలు..
  ఎప్పుడు తమనటనతో మనమధ్యే మనతోటే ఉన్న ఆమహానటుడికి ఆనందాంజలి..
  మనకు నేత్రానందాన్ని,శ్రవణానందాన్ని కలిగించే ఈవీడియోనూ ఆ మహానటుడిపట్ల ఎంతో అభిమానంతో తయారు చేసిన తమ్ముడు చి.సాయి గణేష్ ను అభినందిస్తూ..

  Sangraha vaartha 369.

 10. #490
  Join Date
  Jun 2015
  Posts
  7,979

  Default

  https://youtu.be/IFrftVrjcBE
  ఆ మహా నటుడిని వయసు ఏ మాత్రమూ ఇబ్బంది పెట్టలేదు . ఆయన ముందు ఎందరు హీరోయిన్లు రిటైర్ ఐపోయారో ! ఆయనకే అమ్మగా నటించారో .అక్కినేని మాత్రం ఎవర్ గ్రీన్ హీరో గానే మిగిలిపోయారు .నటుడిగా పుట్టి నటుడిగానే మరణించిన నటసామ్రాట్ వర్ధంతి సందర్భంగా నివాళులతో ఈ కరుణ రసాత్మక సన్నివెశంSangraha vaartha. 370.

 11. #491
  Join Date
  Jun 2015
  Posts
  7,979

  Default

  అక్కినేని ద్విపాత్రాభినయం చిత్రాలు : ఇద్దరు మిత్రులు, గోవుల గోపన్న, బుద్ధిమంతుడు, సిపాయి చిన్నయ్య,
  అక్కా చెల్లెలు, ధర్మదాత, మంచివాడు, శ్రీరామ రక్ష, హేమా హేమీలు, ఏడంతస్తుల మేడ,
  పిల్ల జమీందార్,
  ప్రేమ మందురం,
  గోపాల కృ ష్ణుడు,
  రాముడు కాదు కృష్ణుడు, యస్. పి.భయంకర్,
  జస్టిస్ చక్రవర్తి ( 16 )

  అక్కినేని గారు అతిదిగా మెరిసిన చిత్రాలు: రేచుక్క
  భక్త రామదాసు, సతీ సుమతి, శివరంజని మరియూ భారత్ విలాస్ ( తమిళం )

  అక్కినేని గారు నాటకాలు, సినిమాలు కాకుండా రెండు టీవీ సీరియల్స్ చేశారు : మట్టి మనిషి, ఒకే ఒక్కడు. ఇంత టాప్ హీరో ఎవరూ ఇలా టీవీ సీరియల్స్ చెయ్యలేదు

  అక్కినేని తో అత్యధిక చిత్రాల్లో హీరోయిన్లు గా చేసిన నటీమణులు: సావిత్రి, అంజలీదేవి, వాణిశ్రీ & జయసుధ.

  అక్కినేని గారితో నందమూరి తారకరామారావు గారు నటించిన చిత్రాలు : పల్లెటూరిపిల్ల
  సంసారం
  పరివర్తన
  రేచుక్క ( గెస్ట్ )
  మిస్సమ్మ
  తెనాలి రామకృష్ణ
  చరణదాసి
  మాయాబజార్
  భూకైలాస్
  గుండమ్మకథ
  శ్రీ కృష్ణార్జున యుద్ధం
  చాణక్య చంద్రగుప్త
  రామకృష్ణులు
  సత్య - శివం
  Sangraha vaartha......371.

Bookmarks

Posting Permissions

 • You may not post new threads
 • You may not post replies
 • You may not post attachments
 • You may not edit your posts
 •