Page 8 of 8 FirstFirst ... 678
Results 141 to 145 of 145

Thread: padmavibhushan anr natinchina cinemala samacharam.

 1. #141
  Join Date
  Jun 2015
  Posts
  7,976

  Default

  నాకు నచ్చిన సినిమా

  కులగోత్రాలు

  కులగోత్రాలు ప్రత్యగాత్మ దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, గుమ్మడి ప్రధానపాత్రల్లో నటించిన 1962 నాటి చలనచిత్రం.
  కులగోత్రాలు

  దర్శకత్వం
  కె.ప్రత్యగాత్మ
  నిర్మాత
  అనుమోలు సుబ్బారావు
  నటులు
  అక్కినేని నాగేశ్వరరావు,
  కృష్ణకుమారి,
  గుమ్మడి వెంకటేశ్వరరావు,
  రేలంగి వెంకట్రామయ్య,
  పద్మనాభం,
  సూర్యకాంతం,
  గిరిజ,
  నిర్మలమ్మ,
  మద్దాలి కృష్ణమోహనరావు,
  సంధ్య,
  జి. వరలక్ష్మి,
  మిక్కిలినేని,
  అల్లు రామలింగయ్య
  సంగీతం
  ఎస్. రాజేశ్వరరావు
  నిర్మాణ సంస్థ
  ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ప్రై. లిమిటెడ్
  విడుదల
  1962
  భాష
  తెలుగు
  సంక్షిప్త చిత్రకథ
  కామందు భూషయ్య (గుమ్మడి) కొడుకు రవి (అక్కినేని) విశాఖపట్నంలో చదువుకుంటూ ఉంటాడు. సరోజ (కృష్ణకుమారి) ఎం. బి. బి. ఎస్ చదువుతూ ఒంటరియైన తల్లి కాంతమ్మతో కలిసి నివసిస్తుంటుంది. తల్లి ఆమె కోసం పెళ్ళి సంబంధాలు చూస్తుంటుంది కానీ ఆమె తండ్రి ఎవరో తెలియకపోవడంతో కులగోత్రాలు లేవని వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోతుంటాయి. ఒకసారి వరద భాధితుల సహాయార్థం కళాశాల విద్యార్థులందరూ కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవి, సరోజ కలిసి ఒక నృత్య ప్రదర్శనలో పాల్గొంటారు. అక్కడ నుంచి సరోజ ఇంటికి వెళుతుండగా చలపతి అనే దొంగ (మిక్కిలినేని) ఆమె మెడలో హారాన్ని దొంగిలించబోతే రవి అడ్డుకుని గాయాలపాలవుతాడు. పోలీసులు తరముకు వస్తుంటే తప్పించుకోబోయి చలపతి కాంతమ్మ ఇంట్లో ప్రవేశిస్తాడు. కాంతమ్మను చలపతి మోసం చేసి వదిలేసి ఉంటాడు. ఇన్నాళ్ళు ఆమెను కష్టాలపాలు చేసినందుకు గాను కూతురుకు తండ్రి విషయం తెలియగూడదని ఆమె హెచ్చరించగా బాధతో వెళ్ళిపోతాడు. సరోజ, రవి కలిసి కళాశాల వార్షికోత్సవంలో శకుంతల దుష్యంతుడు నాటకం వేస్తారు. తరువాత ఇద్దరూ ప్రేమించుకుంటారు.
  కులగోత్రాల పట్టింపు గల భూషయ్య రవి ప్రేమను అంగీకరించడు. సరోజకు యిచ్చిన మాట ప్రకారం రవి ఇల్లు వదలి తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా సరోజను గుడిలో పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత సరోజ తల్లి తన బాధ్యతలు తీరిపోవడంతో తీర్థయాత్రలకు వెళ్ళిపోతుంది. రవికి పోలీస్ ఇన్ స్పెక్టరుగా ఆ ఊరిలోనే ఉద్యోగం వస్తుంది. రవి కులగోత్రాలు లేని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని రవి చెల్లెలి పెళ్ళి ఆగిపోతుంది. కానీ అదే సమయానికి రవి వరసకి బావ అయిన జాస్తి జోగారావు (పద్మనాభం) ఆమెను పెళ్ళి చేసుకోవడానికి ముందుకు వస్తాడు. తండ్రి పట్టింపుల వల్ల రవి తన చెల్లెలు పెళ్ళికి కూడా వెళ్ళలేక బయటనుంచే అక్షింతలు వేస్తాడు. రవి తన బావ సదానందం (రేలంగి) స్నేహితులతో కలిసి పేకాడుతుంటే అరెస్టు చేస్తాడు. అతన్ని భూషయ్య వెళ్ళి విడిపించాల్సి వస్తుంది. సదానందం, జగదాంబ కలిసి భూషయ్య ఆస్తిని ఎలా తమ పేరున రాయించుకోవాలో చూస్తుంటారు. ఒకరోజు మెట్లమీద నుంచి జారిపడిన భూషయ్య భార్య మంచాన పడుతుంది. అదే సమయానికి రవి వేరే ఊర్లో ఉండటం వలన అతను వెళ్ళి చూడ్డానికి కూడా వీలుపడదు. రవిని తలుచుకొని అతని తల్లి బాధపడి అనారోగ్యంతో మంచం పట్టి మరణిస్తుంది. భార్య గతించాక భూషయ్యలో మార్పు వస్తుంది. రవికి కొడుకు పుడతాడు. భూషయ్య మమతను చంపుకోలేక దొంగచాటుగా వెళ్ళి మనవణ్ణి చూసి ఎత్తుకొని ముచటపడి వాడి మెడలో బంగారు గొలుసు కానుకగా వేస్తాడు. సదానందం చలపతిలో ఒప్పందం కుదుర్చుకుని తన మామ చేత ఆస్తిపత్రాల మీద సంతకం చేయించుకోవాలనుకుంటాడు. కానీ అతను భూషయ్య యింట్లో దొంగతనం చేసే ప్రయత్నంలో వుండగా రవి వచ్చి అతనితో పోరాటానికి దిగుతాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన సరోజ తుపాకీతో చలపతిని కాల్చేస్తుంది. పంతాలు పట్టింపులు వదలి భూషయ్య కొడుకు, కోడలు, మనవణ్ణి యింట్లోకి ఆహ్వానిస్తాడు.
  తారాగణం
  రవిగా నాగేశ్వరరావు
  సరోజగా కృష్ణకుమారి
  భూషయ్యగా గుమ్మడి
  భూషయ్య భార్యగా నిర్మలమ్మ
  జగదాంబగా సూర్యకాంతం
  సదానందంగా రేలంగి
  చలపతిగా మిక్కిలినేని
  రమణయ్యగా రమణా రెడ్డి
  జాస్తి జోగారావుగా పద్మనాభం
  పెళ్ళిళ్ళ పేరయ్యగా అల్లు రామలింగయ్య
  రాజబాబు
  నిర్మాణం
  అభివృద్ధి
  అప్పటకి గుడిగంటలు, మూగమనసులు, రక్తసంబంధం సినిమాలు రాసిన ముళ్ళపూడి వెంకటరమణకి ఈ సినిమా రాసే అవకాశం లభించింది. అయితే ఆయనకు అప్పటికే ఒప్పుకొని ఎన్నాళ్ళ నుంచో పూర్తికాని దాగుడు మూతలు సినిమా రచనలో బిజీగా ఉండడంతో దీన్ని రాసే బాధ్యతలు రమణ మరో రచయిత రావి కొండలరావుకి అప్పగించారు.
  నటీనటుల ఎంపిక
  తర్వాతికాలంలో సూపర్ స్టార్ గా ఎదిగిన ఘట్టమనేని కృష్ణకు ఇది నటునిగా రెండవ సినిమా. దీనిలో ఆయన ఒక చిన్న పాత్ర చేశారు.
  పాటలు
  పాట
  రచయిత
  సంగీతం
  గాయకులు
  అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
  కొసరాజు
  సాలూరు రాజేశ్వరరావు
  మాధవపెద్ది సత్యం బృందం
  చిలిపి కనుల తీయని చెలికాడా నీ నీడను నిలుపుకొందురా వెల్గుల మేడ
  సి.నారాయణరెడ్డి
  సాలూరు రాజేశ్వరరావు
  ఘంటసాల, పి.సుశీల
  చెలికాడు నిన్నేరమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
  సి.నారాయణరెడ్డి
  సాలూరు రాజేశ్వరరావు
  ఘంటసాల, పి.సుశీల
  మామా శతృభయంకర నామ అందానికి చందమామ
  కొసరాజు
  సాలూరు రాజేశ్వరరావు
  మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు
  రావయ్యా మా యింటికి రమ్మంటే రావేల మా యింటికి కృష్ణయ్యా
  కొసరాజు
  సాలూరు రాజేశ్వరరావు
  సత్యారావు, స్వర్ణలత
  రావే రావే బాలా, హలో మైడియర్* లీలా
  కొసరాజు
  సాలూరు రాజేశ్వరరావు
  పి.బి. శ్రీనివాస్
  నీ నల్లని జడలో పూలు
  కొసరాజు
  సాలూరు రాజేశ్వరరావు
  జమునారాణి, పిఠాపురం నాగేశ్వరరావు
  సఖీ శకుంతల రెక్కలు ధరించి ప్రియునిచెంత వాలగలేవా
  శ్రీశ్రీ
  సాలూరు రాజేశ్వరరావు
  ఘంటసాల, పి.సుశీల

 2. #142
  Join Date
  Jun 2015
  Posts
  7,976

 3. #143
  Join Date
  Jun 2015
  Posts
  7,976

  Default

  మేఘ సందేశం (సినిమా)

  తెలుగు సినిమా*వేదిక
  మేఘ సందేశం
  (1982 తెలుగు సినిమా)

  దర్శకత్వం
  దాసరి నారాయణరావు
  నిర్మాణం
  దాసరి పద్మ
  కథ
  దాసరి నారాయణ రావు
  చిత్రానువాదం
  దాసరి నారాయణ రావు
  తారాగణం
  అక్కినేని నాగేశ్వరరావు ,
  జయప్రద ,
  జయసుధ,
  కొంగర జగ్గయ్య
  సంగీతం
  రమేష్ నాయుడు
  సంభాషణలు
  దాసరి నారాయణ రావు
  ఛాయాగ్రహణం
  పి ఎన్ సెల్వరాజు
  నిర్మాణ సంస్థ
  శ్రీ మురళీకృష్ణ ఆర్ట్ క్రియెషన్స్
  పంపిణీ
  తారక ప్రభు ఫిలిమ్స్
  విడుదల తేదీ
  24 సెప్టెంబరు 1982
  నిడివి
  151 ని
  దేశం
  భారత్
  భాష
  తెలుగు
  తారాగణం
  అక్కినేని నాగేశ్వర రావు - రవీంద్ర బాబు
  జయసుధ - రవీంద్ర బాబు భార్య
  జయప్రద - పద్మ
  కొంగర జగ్గయ్య - రవీంద్ర బాబు బావ
  మంగళంపల్లి బాలమురళీకృష్ణ - స్వయం
  సుభాషిణి
  సలీమా
  సంగీతం
  రమేష్ నాయుడు.
  పాటలు
  క్రమసంఖ్య
  పేరు
  గీత రచన
  నేపథ్యగానం
  నిడివి
  1.
  "ఆకాశ దేశాన"
  వేటూరి సుందర్రామ్మూర్తి
  యేసుదాసు

  2.
  "ఆకులో ఆకునై పూవులో పూవునై"
  దేవులపల్లి కృష్ణశాస్త్రి
  పి.సుశీల

  3.
  "పాడనా వాణి కళ్యాణిగా గానం -"
  వేటూరి సుందర్రామ్మూర్తి
  మంగళంపల్లి బాలమురళీకృష్ణ

  4.
  "ప్రియే చారుశీలె"
  జయదేవ
  యేసుదాసు

  5.
  "ముందు తెలిసెనా, ప్రభూ"
  దేవులపల్లి కృష్ణశాస్త్రి
  పి.సుశీల

  6.
  "నవరస సుమ మాలిక" (పద్యం)
  వేటూరి సుందర్రామ్మూర్తి
  యేసుదాసు

  7.
  "నిన్నటిదాకా శిలనైనా గానం -"
  దేవులపల్లి కృష్ణశాస్త్రి
  పి.సుశీల

  8.
  "రాధికా కృష్ణా"
  జయదేవ
  యేసుదాసు

  9.
  "శీత వేళ రానీయకు రానీయకు"
  దేవులపల్లి కృష్ణశాస్త్రి
  పి.సుశీల, యేసుదాసు

  10.
  "సిగలో అవి విరులో"
  దేవులపల్లి కృష్ణశాస్త్రి


  బహుమతులు
  Year
  Nominated work
  Award
  Result
  1983
  దాసరి నారాయణ రావు
  జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు చిత్రం
  విజేత
  రమేష్ నాయుడు
  జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీతదర్శకులు
  విజేత
  పి సుశీల
  జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ గాయని
  విజేత
  కె జె యేసుదాస్
  జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ గాయుకుదు
  విజేత
  దాసరి నారాయణ రావు
  నంది ఉత్తమ చిత్రాలు - స్వర్ణ నంది
  విజేత
  దాసరి నారాయణ రావు
  ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు చిత్రం
  విజేత
  విశేషాలు
  ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు నటించిన 200వ చిత్రం.
  ఈ చిత్రంలోని శ్రావ్యమైన గానానికి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకి ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది పురస్కారం లభించింది.
  ఈ చిత్రం మలయాళంలో కూడా ఇదే పేరుతో డబ్ చేయబడింది.
  Last edited on 10 మార్చి 2017, at 05:56
  వికీపీడియా

 4. #144
  Join Date
  Jun 2015
  Posts
  7,976

  Default


 5. #145
  Join Date
  Jun 2015
  Posts
  7,976

  Default

  మరుగున పడిన గీతాలు - 204
  దినదినగండం నూరేళ్ళ ఆయుషు అన్న సామెత యీ చిత్రానికి సరిగా వర్తిస్తుంది. సంసారంలోని కష్టాలే కధాంశంగా కూడిన యీ చిత్ర నిర్మాణం చేపట్టినది మొదలు అన్నీ కష్టాలే చుట్టుముట్టాయి. దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ దగ్గర కధారచనలో సహాయకుడిగా జేరిన ఆత్రేయగారు వ్యక్తిగత కారణాలపై మధ్యలోనే వెళ్ళిపోయారు. ఆమె ఉత్సాహాన్ని చూసి తన అభిమాన నటుడి ప్రక్కనే నటించే అవకాశాన్ని కలిగిస్తే, సావిత్రి నాగేశ్వరరావుతో నటిస్తున్నాననే భావనలో ఉబ్బితబ్బిబ్బయి సరిగా నటించలేకపోతోందని, ఆమెను తప్పించి పుష్పలతను పెట్టాల్సివచ్చింది. జరుగుతున్న జాప్యంతో ఖర్చు తడిపిమోపెడవుతోందని నిర్మాత చేతులెత్తేస్తున్న సమయంలో లక్ష్మీరాజ్యం గారు ముందుకొచ్చి చిత్రనిర్మాణం పూర్తి చేయించారు. చిత్రం విజయవంతమయ్యాక ఒప్పందం ప్రకారం నిర్మాత లక్ష్మీరాజ్యంగారికి అధికంగా యిచ్చిన మొత్తంపై ఆదాయశాఖపన్నువారు అల్లరిపెట్టారు. అలా ఆమెకు అదనంగా వచ్చిన మొత్తం బహుమతిగా లభించిన మొత్తమా, చిత్రంలో నటించినందుకు ఆమెకు పెంచియిచ్చిన పారితోషికమా అన్నదానిపై స్పష్టత లేక నిర్మాత కోరిన పన్ను రాయితీ యివ్వటానికి ఆదాయపన్ను శాఖవారు నిరాకరించారు. దానిపై కోర్టులో చాలా రగడ నడిచిందని యీ మధ్యనే ఎక్కడో చదివాను. కానీ సుసర్ల దక్షిణామూర్తిగారు క్షిత్రానికి అందించిన సంగీతం ప్రజలను మంత్రముగ్ధులను చేసినది. ఇంతలా ప్రజలను అలరించిన సంసారం చిత్రం యిప్పుడు చూట్టానికి ఒక్క ప్రింటు కూడా లేకుండా పోయింది. ఈ చిత్రం తెలుగులో హిట్టయ్యాక, అదే పేరుతో తమిళంలో తీశారు. తమిళకాపీ మాత్రం మనకు లభ్యం అవుతోంది. తదుపరి హిందీలో సంసార్ పేరుతోను, మళయాళంలో అయోధ్య పేరుతోను తీశారు. తెలుగుచిత్రం దొరక్కపోయినా 1950 లో వచ్చిన సంసారం చిత్ర గీతాల ఆడియోలు లభ్యం కావటం మన అదృష్టం. ఇప్పుడు మీరు చూడబోయే పాటను గోపాలరాయశర్మ వ్రాయగా పి.లీల పాడారు. ఆర్ధిక యిబ్బందులకు తట్టుకోలేక భర్త రాత్రివేళ పారిపోతే, పిల్లలతో రోడ్డున పడ్డ భార్య హోరువానలో కార్లషెడ్లలోను, చెట్లక్రింద తలదాచుకొంటుంది. చూడండి.

Bookmarks

Posting Permissions

 • You may not post new threads
 • You may not post replies
 • You may not post attachments
 • You may not edit your posts
 •